వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధుకు 5 కోట్లు, గోపీకి కోటి: చంద్రబాబును మించి కేసీఆర్ నజరానా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే గోపీచంద్ అకాడమీకి దగ్గర్లో వెయ్యి గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

సింధుకు మద్దతుగా భారత్: ఏపీ, తెలంగాణ మాత్రం ఆమె కులం కోసం శోధించారు

సింధు కావాలంటే తెలంగాణలో తగిన ఉద్యోగం ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నగరంలో అకాడమీని ఏర్పాటు చేసి ఎంతోమంది ఛాంపియన్లను కోచ్ పుల్లెల గోపీచంద్ తయారుచేశారని, ఆయన చేతుల మీదుగానే సింధుతో పాట సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, కిదాంబి శ్రీకాంత్ లాంటి క్రీడాకారులు వచ్చారని అన్నారు.

 Telangana government announces Rs 5 crore reward to P V Sindhu

బ్యాడ్మింటన్ రంగంలో గోపీచంద్ చేసిన సేవలకు గాను ఆయనకు కోటి రూపాయల నగదు బహుమతి అందించనున్నట్టు ఆయన తెలిపారు. సింధుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌కు కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.

ఈనెల 22వ తేదీన హైదరాబాద్ వస్తున్న పీవీ సింధుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నిర్ణయం తీసుకున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళలు పతకాలు సాధించి, మహిళా శక్తిని చాటారని ఆయన అభినందించారు.

గతంలో ఆ అమ్మాయి రెండు సార్లు కొంచెం ఆర్ధిక సహాయం కావాలని కోరినప్పుడు ప్రభుత్వం తరుపున రూ. 40 లక్షలమసహాయం చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఆ అమ్మాయికి కోచ్‌గా ఉన్న గోపీచంద్‌కు కూడా ఆ అమ్మాయికి మంచి కోచింగ్ ఇవ్వమని చెప్పి రూ. 50 లక్షల ఇవ్వడం జరిగిందన్నారు. ‌

గతంలో సానియా మీర్జాకు ప్రోత్సాహం ప్రకటించిన తరువాత వరుసగా సంవత్సరం మొత్తం సుమారు 30 మ్యాచ్‌లలో విజయం సాధించిందని, సింధు కూడా అలాగే గెలవాలని తెలంగాణ సర్కారు కోరుకుంటోందని ఆయన అన్నారు.

English summary
Telangana government on Saturday announced cash reward of Rs 5 crore to Olympic silver medalist in women’s badminton singles P V Sindhu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X