Holiday: తెలంగాణ సర్కారు కీలక ప్రకటన.. రేపు ప్రత్యేక సెలవు

Holiday: తెలంగాణ సర్కారు మరో కీలక ప్రకటన చేసింది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు గిరిజనులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసింది. గిరిజన ఉద్యోగులకు రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న గిరిజన ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పబ్లిక్ హాలిడే ఇవ్వాలని గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతుండగా.. ప్రభుత్వం క్యాజువల్ లీవ్ ను మంజూరు చేసింది. కేవలం బంజారా గిరిజనులకు మాత్రమే ఇవ్వడం పట్ల గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని గిరిజన సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రాలు సమర్పించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం క్యాజువల్ లీవ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాజువల్ లీవ్ కాబట్టి స్కూళ్లకు ఫిబ్రవరి 15న సెలవు లేనట్టే. ఫిబ్రవరి 15న దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు సేవాలాల్ జయంతిని ఒక పండుగలాగా జరుపుకుంటారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంతా సంచారం చేస్తూ బంజారాలకు హితబోధ చేసిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్. బంజారా జాతిని మూఢ నమ్మకాలు, హింస, మద్యపానం మొదలైన వ్యసనాలకు బానిస కాకుండా స్వచ్ఛమైన జీవనం సాగించాలని బంజారాలకు హితోపదేశం చేసిన మహానుభావుడు. ఈ క్రమంలో సేవాలాల్ ను గిరిజనులు ఆరాధ్య ధైవంగా భావిస్తారు.

Telangana Government Announces Special Leave on Sevalal Maharaj Jayanti
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+