తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం.. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ కట్ !

హైదరాబాద్‌లోని రామాంతాపూర్, బండ్లగూడ ప్రాంతాల్లో విద్యుత్ షాక్‌ల కారణంగా ప్రజలు మరణించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై అనుమతి లేకుండా వేసిన ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యతో ప్రజలకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించి కఠిన ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేటర్లకు నోటీసులు, సమయం ఇచ్చినా స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజల ప్రాణాలు ముప్పులో ఉన్నందున ఇకపై ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మహానగరంలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌పై కూడా చర్చించారు.

telangana-government-decides-to-remove-internet-and-tv-cables-on-electricity-poles

ఈ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, నగరంలో పది రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేలాది కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్‌వర్క్ వైర్లను తొలగిస్తుండటంతో కేబుల్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గణేష్ నిమజ్జనం నాటికి అన్ని కేబుళ్లను తొలగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇంటర్నెట్ ప్రొవైడర్ల ఆవేదన..

విద్యుత్ శాఖ చర్యల వల్ల నగరంలో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులు, డిజిటల్ సేవలను ఉపయోగించే సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

COAI ఆందోళన..

ఈ మేరకు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ కేబుళ్లలో విద్యుత్ ఉండదని, వాటికి కరెంట్ షాక్‌లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ విచక్షణారహితంగా కేబుళ్లను కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ అభివృద్ధిలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఇటువంటి చర్యలు డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఆటంకం కలిగిస్తాయని అన్నారు.

మరోవైపు కేబుల్, ఇంటర్నెట్ ప్రొవైడర్ల జేఏసీ సభ్యులు తమను ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ ఎస్పీడీసీఎల్ సీఎండీని కలిశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒక ప్రణాళికతో రావాలని సీఎండీ వారికి సూచించారు. ఈరోజు జరిగే చర్చలు విఫలమైతే.. హైదరాబాద్ నగరంలో ఇంటర్నెట్ సేవలను స్వయంగా నిలిపివేస్తామని ప్రొవైడర్లు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+