తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. వాటి గడువు పొడిగింపు
Telangana: తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) పాలక వర్గ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాల కాల పరిమితి, 9 డీసీసీబీ ఛైర్మన్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఆయా పాలక వర్గాల పదవీ కాలాలకు ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలవ్వాల్సి ఉండగా..ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం గమనార్హం.
ఫిబ్రవరి 15 నాటికే గడువు ముగుస్తున్నా.. ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ప్రకటన విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న పాలక వర్గాల రేపటితో గడువు ముగియనుండగా.. ప్రభుత్వం ప్రస్తుత పాలక వర్గాల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే స్థానిక ఎన్నికల అనంతరమే వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా దీన్ని బట్టి తెలుస్తోంది. పదవీ కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సహకార సంఘాల పాలక వర్గాలు, డీసీసీబీ ఛైర్మన్లు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.













Click it and Unblock the Notifications