పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్
రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పద్మశ్రీ అవార్డు అందుకున్నవారికి రూ. 2 వేల పింఛను అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కాగా, ఇటీవలే పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కండప్పకు ప్రతీ నెల. 25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. అంతేగాక, పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25 వేల పింఛను ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా పింఛనుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భాష సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఆరోగ్యశ్రీ ధరలను సవరించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్సకు సంబంధించిన ధరలను తాజాగా సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అదే సమయంలో కొత్తగా 163 చికిత్సలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20 నుంచి 20శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.438 కోట్ల భారం పడుతుందన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి అదనపు ఖర్చు రూ.600 కోట్లు పెరిగిందన్నారు. ట్రస్ట్ ద్వారా దాదాపు 6 లక్షల మందికి బాసటగా ఉందని తెలిపారు. కొత్త ప్రొసీజర్స్‌తో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకోబోతుందని వివరించారు. 79 లక్షల కుటుంబాలకు ఆరోగ్యపరంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications