New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన.. !
తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఇప్పటి వరకు రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ రావడం.. అంతకు ముందు రేషన్ కార్డు ఇ కేవైసీ ఉండడంతో కొత్త రేషన్ కార్డుల జారీ లేట్ అయింది.
ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ రావాలన్నా.. గ్యాస్ సబ్సిడీ కావాలన్నా, ఉచిత విద్యుత్ పొందలన్నా రేషన్ కార్డు అవసరం. అందుకే లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడానికి విధివిధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డున్న వారికి మూడు నెలల తర్వాత సన్న బియ్యం ఇస్తామన్నారు. వచ్చే సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఇ కేవైసీ చేసుకోవాలని చెబుతున్నారు. ఇ కేవైసీ చేసుకోకుంటే వారికి రేషన్ ఇవ్వరు. రేషన్ కార్డ కేవైసీని రేషన్ డీలర్లు పూర్తి చేస్తారు. మన ఆధార్ నంబర్ నమోదు చేసిన తర్వాత బయోమెట్రిక్ ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ పూర్తి అయినట్లు.












Click it and Unblock the Notifications