వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెతరుక్కు పోతుంది.. ఇంట‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త .. కేసీఆర్‌పై బండి సంజ‌య్ ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఫెయిల్ అయ్యామన్న మనోవేదనతో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్షంతోనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష‌డు బండి సంజయ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

గుండెత‌రుక్కు పోతుంది

గుండెత‌రుక్కు పోతుంది

విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులు తమ నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌

కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యార్థులంతా ఆన్ లైన్ ద్వారానే క్లాసులకు హాజరయ్యారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఆన్ లైన్ క్లాసులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో విఫలమైందని సంజ‌య్ పేర్కొన్నారు. పరీక్ష‌ల్లో తప్పిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే ఉన్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఉచితంగా రీ వాల్యుయేష‌న్‌..

ఉచితంగా రీ వాల్యుయేష‌న్‌..

ప్రభుత్వనిర్లక్షానికి ఇంకెంత మంది బలికానునున్నారో అని బండి సంజయ్ మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు, ఫెయిలయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రం వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఫెయిలయిన విద్యార్ధులకు ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయించాలని కోరారు.

విద్యార్ధుల భవిత్యుత్తుతో ఆడుకోవడం ప్ర‌భుత్వానికి కొత్తకాదు

విద్యార్ధుల భవిత్యుత్తుతో ఆడుకోవడం ప్ర‌భుత్వానికి కొత్తకాదు

కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం కొత్తేమి కాదని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో కూడా మంత్రి కేటీఆర్ బినామీ నిర్వాకంతో 27 మంది బలైయ్యారని మండిపడ్డారు.. అయితే ఒక విద్యార్థి తన చావుకు కారణం మంత్రి కేటీఆర్ అని తన ట్వీట్టర్ ట్విట్ చేశాడు.

విద్యార్థి ఆవేదన చూస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో అర్థం అవుతుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని విద్యార్థుల‌కు కోరారు.

English summary
Telangana BJP Chief Bandi Sanjay Serious on CM KCR over Inter Students Suicide..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X