దివ్యాంగులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్న విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయో పరిమితిలోనూ ఐదేళ్ల మినహాయింపు ఇచ్చింది.
దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దివ్యాంగులను ఐదు కేటగిరీలుగా విభించి, ఒక్కో కేటగిరి వైకల్యానికి ఒక్కో శాతం రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.

దృష్టిలోపం- ఏ కేటగిరి
వినికిడి లోపం, మూగ - బీ కేటగిరి
అంగవైకల్యం - సీ కేటగిరి
మానసిక వైకల్యం - డీ కేటగిరి
ఒకటికి మించిన వైకల్యాలు - ఈ కేటగిరిగా విభజించింది.
ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఒక్కోశాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే.. ఆ ఖాళీలను సంబంధిత రిజర్వుడ్ (ఎస్సీ ఎస్టీ, బీసీ..) వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.












Click it and Unblock the Notifications