రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది అయితే ఈ వృద్ధి రాష్ట్రంలో అనేక సవాళ్లకు కారణమవుతుంది. ఆర్థికపరంగా వరి ధాన్యం సేకరణ ప్రభుత్వానికి కష్టతరంగా మారడమే కాకుండా, రాష్ట్రంలో బియ్యం నిల్వలు కూడా పేరుకుపోతున్న పరిస్థితి ఉంది.

వరి సాగుపై తెలంగాణా సీఎం రేవంత్ కీలక నిర్ణయం

వరి ఎక్కువ సాగు చేయడం వల్ల, అధిక నీటిని వినియోగించాల్సి వస్తుంది. దీని వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పంట మార్పిడి చేయకుండా పదేపదే వరి సాగు చేయడం వల్ల భూసారం కూడా తగ్గుతుంది. ఇది ఉత్పాదకత పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telangana government plan to give incentives those farmers who are shift from paddy cultivation to high-demand alternative crops

రైతులకు ఎకరానికి పదివేల రూపాయల ప్రోత్సాహకం

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి మరల్చడం కోసం ఆయన త్వరలోనే బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే రైతులకు ఎకరానికి పదివేల రూపాయల ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇది పంట మార్పిడికి ఊతమిచ్చే అవకాశం ఉందని, దీనివల్ల రైతాంగానికి లబ్ది జరుగుతుందని తెలుస్తోంది.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు నగదు ప్రోత్సాహం

వరి సాగు తగ్గించే ప్రత్యేక పథకాలను పంజాబ్ అమలు చేస్తున్న క్రమంలో ఆ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. పప్పు ధాన్యాలు, వాణిజ్య పంటలు లేదా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి రైతులకు నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో చర్చలు జరిపారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పంట, సేకరణ

రైతులకు ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపైన ప్రస్తుతం కసరత్తు జరుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వరి సేకరణ కోసం ఎకరానికి 20 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంటే, దానిని నిలువ చేయడం కూడా ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.

తెలంగాణాలో వరిపంటకు ఇబ్బంది

గత వానాకాలంలో దేశంలోనే అత్యధికంగా 148 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారు. ఆ సీజన్లో వరి సేకరణకు ప్రభుత్వం సుమారు 24 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక కేంద్రం కూడా బియ్యం కోటాపై పరిమితులు విధించడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో గట్టి పోటీ ఉండడంతో పంట మార్పిడి అనివార్యంగా కనిపిస్తుంది.

రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సూచించనున్న ప్రభుత్వం

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పప్పు ధాన్యాలు, కూరగాయలు, క్యాప్సికం, పూలు ఇతర విదేశీ పండ్ల వంటి ఉద్యానవన పంటల డిమాండ్ పైన నివేదికను రూపొందించి, ఆ జాబితాను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత,ప్రభుత్వ అంగీకారం మేరకు రైతులకు అందించనుంది. వరి సాగు తగ్గించుకోవడం వల్ల పదివేల రూపాయల ఆర్థిక సహాయం తో పాటు, పండించే పంటలకు గిట్టుబాటు ధర మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు .ఏది ఏమైనా త్వరలోనే దీనిపైన క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+