Rythu Bharosa: గుడ్ న్యూస్.. మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల
Rythu Bharosa: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఇప్పటివరకు రెండు ఎకరాల లోపు భూమిని కలిగిన రైతుల ఖాతాల్లో నగదును జమ చేసిన ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి మూడెకరాల లోపు భూమి కలిగిన అన్నదాతల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులను జమ చేస్తోంది. ఈ మేరకు మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుభరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.1,230 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం రూ.3,487.25 కోట్లు పంపిణీ చేసింది. డీబీటీ పద్ధతదిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
గత సర్కారు పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. ఈ పంట పెట్టుబడి సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12వేలకు కూడా పెంచారు. దీంతో ఎకరానికి ప్రతి రైతు ఖాతాలో రూ.6వేలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతుభరోసా కింద రెండు సార్లు పంట పెట్టుబడి సాయం రైతులకు అందుతుంది. రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.20 వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనుంది. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలుకొని ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు.













Click it and Unblock the Notifications