విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్..!
చదువుకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఆలోచనతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ స్కీం కారణంగా ఎందరో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు సైతం ఉన్నత చదువులు సైతం చదువుకోగలుగుతున్నారు. పేద విద్యార్ధులు సైతం డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను సైతం అభ్యసించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్ధులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
హాజరు లేకపోతే ఇక అంతే..
తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థికి కచ్చితంగా 75శాతం హాజరు ఉండాల్సిందేనని.. లేదంటే వారు రీయింబర్స్‌మెంట్ పొందే ఛాన్స్ ఉండదని వివరించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సిలర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నియమాన్ని ప్రభుత్వాలు గతంలోనే ఆదేశాలు జారీ చేశాయని.. కానీ చాలా కాలేజీల్లో సరిగా అమలు చేయడం లేదని ఈసీలు ప్రస్తావించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని కచ్చితంగా తెలియజేయాలని సూచించారు. అందుకు గాను తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ కారణంగా విద్యార్థులు తప్పకుండా కాలేజీలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలానే ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్ల విధానం అమల్లో ఉంది. అయితే తాజాగా వాటిని 142కు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 75 శాతం హాజరు విధానంపై కాలేజీలు, విద్యార్థులు ఎలా స్పందిస్తారో అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలో సీటు కోసం దోస్త్ ద్వారా అప్లై చేసుకున్న వారికి తొలి విడతలో సీట్లు కేటాయించారు. ఇప్పుడు సీటు దక్కని వారికి.. సీటు వచ్చినా కానీ కాలేజీ నచ్చని వారికి మరో విడతలో అవకాశం కల్పించనున్నారు.
-
ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షలు ఉచితంగా, బడ్జెట్ లో భట్టి ప్రకటన - అమలు ఇలా..!! -
బడ్జెట్ లో కొత్త పథకాలు: వీరికి భారీగా లబ్ది - అమలు ముహూర్తం..!! -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!! -
భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications