ఆత్మాభిమానాన్ని చంపుకొని భాష పండితులు వెట్టి చాకిరీ..
Recommended Video

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...వేల్పుల స్వామి యాదవ్ టి.వై.ఎస్.ఎఫ్.రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతు ఈ ఐదు రోజులు చాలా చక్కగా గడిచింది. కేసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, భాష పండిట్లు వెట్టి చాకిరీ చేస్తూ, ఆత్మగౌరవం చంపుకుని పని చేస్తున్నారు., మా కష్టాలను అర్ధం చేసుకోవాలి అంటు.,హైదరాబాద్ వాతావరణం,ఆహార వసతులు బాగున్నాయి.,ఇక్కడికి రావటం అదృష్టంలా భావిస్తున్నాను అని అన్నారు.












Click it and Unblock the Notifications