సండే-ఫన్ డే ట్యాంక్ బండ్ : లేజ‌ర్ షో-స్టాల్స్-ఫుడ్ ట్రక్స్ రెడీ : రూ. 27 కోట్లతో మార్చేసారు..!!

కరోనా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడాదిన్నార కాలంగా ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఆహ్లాదకరమైన ప్రదేశానికి.లేదా పార్కులకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే అనేక పార్కులు...ఎమ్యూజ్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ సంథింగ్ స్పెషల్. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆ ప్రదేశాన్ని సండే స్పెషల్ వెకేషన్ గా మార్చాలని నిర్ణయించారు. అందులో భాగంగా..ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ, న‌గ‌ర‌వాసులు ట్యాంక్‌బండ్‌పై కాలిన‌డ‌క‌తో అంతా ప‌ర్య‌టించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్ ఫ్రీ ట్యాంక్ బండ్

ట్రాఫిక్ ఫ్రీ ట్యాంక్ బండ్

ఇప్ప‌టికే ట్యాంక్‌బండ్ అందాల‌ను న‌గ‌ర‌వాసులు ఆస్వాదించేందుకు ట్యాంక్‌బండ్‌ను ట్రాఫిక్ ఫ్రీగా మార్చేశారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందనే కనిపిస్తోంది. పిల్లలతో కలిసి వచ్చేలా వారిని ఆకట్టుకొనే కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం వినోద కార్య‌క్ర‌మాల‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ట్యాంక్‌బండ్‌పై ఈ సండేను మ‌రింత ఫ‌న్‌డే గా మార్చుకోమ‌ంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్ర‌త్యేక‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ సూచించారు. క‌ళ‌లు, హ‌స్త‌క‌ళ‌ల‌కు సంబంధించిన స్టాల్స్‌తో పాటు సంగీత కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. హైద‌రాబాద్ రుచుల‌ను చూసేందుకు ప్ర‌త్యేకంగా ఫుడ్ ట్ర‌క్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

లేజర్ షో-ఫుడ్ ట్రక్స్..అంతా స్పెషల్

అంతేకాదు హుస్సేన్ సాగ‌ర్‌పై లేజ‌ర్ షోతో పాటు ట్యాంక్‌బండ్‌పై అన్ని వైపులా ప్రేక్ష‌కుల గ్యాల‌రీలు ఏర్పాటు చేస్తున్నారు. న్యూ యార్క్‌ నగరానికి 'లిబర్టీ ఐల్యాండ్‌'... లండన్‌ నగరానికి 'ట్రాఫాల్‌గర్‌ స్కేర్‌'... మాదిరిగా హైదరాబాద్‌ నగరానికి ట్యాంక్‌బండ్‌ ఒక మణిహారం. అలాంటి ట్యాంక్‌ బండ్‌ను అత్యాధునిక హంగులతో, వారసత్వ శోభతో ఆకట్టుకొనేలా తీర్చి దిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన. ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సుమారు రూ.27 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఇప్పటికే 90 శాతం సుందరీకరణ పనులు పూర్తయ్యాయి.

సుందరీకరణ..పిల్లలకు ఆకర్షణీయంగా

సుందరీకరణ..పిల్లలకు ఆకర్షణీయంగా

సుందరీకరణలో భాగంగా ఇరువైపులా ఫుట్‌పాత్‌లను పూర్తిగా తొలగించి, ఆధునీకరించారు. ఎంతో విశాలంగా ఉన్న ట్యాంక్‌ బండ్‌పై గ్రానైట్‌ రాళ్లతో ఫుట్‌పాత్‌లను తీర్చిదిద్దారు. ట్యాంక్‌ బండ్‌ ప్రాంతం గట్టిగా ఉండేందుకు క్రషర్‌ సాండ్‌తో పీసీసీ, స్లాబ్‌ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ చేశారు. 25-30 మందంతో గ్రానైట్‌ రాళ్లను ప్లేమ్‌ ఫినిష్డ్‌ ఉపరితలంలో వేశారు.

కాగా, ప్రతియేటా గణేశ్‌ ఉత్సవాల సమయంలో విగ్రహాల నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసే క్రేన్‌ల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేశారు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఫుట్‌పాత్‌ ఆధునీకరణ పనులకు మొత్తం రూ.14.50 కోట్లను ఖర్చు చేయగా, రూ.12.50 కోట్లతో హేరిటైజ్‌ శైలిలో విద్యుత్‌ దీపాలంకరణను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యేక లైటిం్..సాయంత్రం వేళ ఆకట్టుకొనేలా

ప్రత్యేక లైటిం్..సాయంత్రం వేళ ఆకట్టుకొనేలా

హైదరాబాద్‌ నగరం అంటేనే ఎంతో పురాతన, వారసత్వ సంపదకు నిలయం. అలాంటి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ కట్టపై అలనాటి వారసత్వాన్ని కళ్ల ముందుంచి సరికొత్త తరహాలో విద్యుత్ దీపాలంకరణను చేపట్టారు. ఆధునిక శైలిలో రూపొందించిన బస్టాప్‌లను, రెయిన్‌ షెల్టర్లను, కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణతో కూడిన వీధి దీపాల స్తంభాలను ప్రతి 15 మీటర్లకు ఒకటి ఎడమ వైపు, ప్రతి 30 మీటర్లకు ఒకటి చొప్పున కుడివైపున ఏర్పాట్లు చేశారు.

బోటింగ్ విన్యాసాలు-స్పెషల్ ప్రోగ్రామ్స్

బోటింగ్ విన్యాసాలు-స్పెషల్ ప్రోగ్రామ్స్

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ట్యాంక్‌బండ్‌పై నుంచి చూసేందుకు ఇక్కడి నుంచి అవకాశముంది. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ విన్యాసాలు, బోటింగ్‌లో తిరిగే వారిని వీక్షించడంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకమైన హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని నగరవాసులు వీక్షిస్తూ ఆహ్లాదకరమైన వాతావారణాన్ని అస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతం గా ట్యాంక్ బండ్ సిద్దం కానుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+