చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్
తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర చేనేతశాఖ స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. రుణమాఫీ అమలుపై రాష్ట్ర చేనేతశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ మార్గదర్శకాలు జారీ చేశారు. రుణమాఫీ అనంతరం చేనేత కార్మికులు కోరుకుంటే మళ్లీ ఆమేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి.

ఎవరైనా కార్మికులు ప్రస్తుతం చేనేత కార్యకలాపాల్లో లేకపోయినా, వారి ఖాతాలు నిరర్థక ఆస్తుల ఖాతా(ఎన్‌పీఏ) కింద ఉన్నా.. మళ్లీ రుణాలు రావు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సత్వరమే అర్హులైన చేనేత కార్మికుల రుణమాఫీకి అన్ని జిల్లాల ఏడీలు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో శైలజారామయ్యర్ వెల్లడించారు. దీనికి బ్యాంకులు సహకరించాలి కోరారు.
కాగా, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లాస్థాయి కమిటీలో డీసీసీబీ సీఈవో, చేనేతశాఖ ఆర్‌డీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారి సభ్యులుగా ఉంటారు. చేనేత శాఖ ఏడీ కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా పరిధిలో చేనేత కార్మికులు నిర్దిష్ట కాలంలో రుణాలు పొందిన వివరాలను శాఖ ఏడీలు బ్యాంకర్ల నుంచి తీసుకోవాలి. వాటి ఆధారంగా కార్మికులవారీగా క్లెయిమ్‌లను తయారు చేసి జిల్లాస్థాయి కమిటీ ఆమోదం కోసం పంపించాలి.
జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదనలు పంపిస్తారు. చేనేతశాఖ డైరెక్టర్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ, టెస్కాబ్, నాబార్డు రాష్ట్రస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. అదనపు డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాల్లో జమ అవుతుంది. అనంతరం బ్యాంకర్లు ఎలాంటి బకాయిల్లేవని(నో డ్యూస్) ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications