Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు సహా.. అన్ని బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ మేరకు బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌​భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్ అడిగారు.

తన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నారా? లేదా? నిర్ధారించాలన్నారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

Telangana governor Tamilisai Soundararajan

రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌భవన్ పేర్కొంది. ఉద్యోగుల శ్రేయస్సు, కార్పొరేషన్ బాగు కోరి కొన్ని సిఫార్సులతో ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును(TSRTC Bill) శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్‌​భవన్​ వెల్లడించింది.

ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు.. రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు ఇతరత్రా వార్తలు వస్తున్న తరుణంలో మీడియాకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు వివరించింది. దురుద్దేశంతో చేస్తున్న అసత్యాలు, నిరాధార ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని ప్రజలు, ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగులకు రాజ్‌భవన్ విజ్ఞప్తి చేసింది.

గవర్నర్ సిఫార్సు చేసిన పది అంశాలు ఇవే

ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా టీఎస్ఆర్టీసీకి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలి. దాని అవసరాలకే వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన మాట(అండర్ టేకింగ్) ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలి.
ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత తీసుకోవాలి.
విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లానే పేస్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలి.
వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్, గ్రాట్యూటీ, ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలి.
తీవ్రమైన ఒత్తిడి, శారీరక సమస్యలు, ఆరోగ్యపరమైన కారణాలను చూపుతూ కార్మికులు విజ్ఞప్తి చేసుకుంటే వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు అవకాశం ఉండాలి.
ఆర్టీసీలో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లాగానే మానవీయంగా ఉండాలి.
ప్రభుత్వంలో విలీనం చేసుకున్న ఉద్యోగులను వేరే శాఖలకు డిప్యూటేషన్ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు రక్షణ ఉండాలి. పదోన్నతుల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సేవల ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలు కల్పించాలి. వారి సర్వీసుకు పరిరక్షణ, పీఎఫ్‌తోపాటు అన్ని సదుపాయాలు కల్పించాలి.
రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంతకాలం ఆర్టీసీ ఆస్పత్రుల్లో సేవలు, ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సలు, బీమా ప్రయోజనాలను నిర్దిష్ట స్థాయి వరకు ఉమ్మడిగా కల్పించాలి. రెగ్యూలర్ ఉద్యోగుల కుటుంబాలనూ ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేర్చాలి.
ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారాన్ని భరించాలి.

మరోవైపు ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ కావాలనే ఆపుతున్నారని కొందరు ఆర్టీసీ సంఘం నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై తమిళిసై సంతకం చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+