మరోసారి మంచి మనసు చాటుకున్న గవర్నర్ తమిళిసై: గాయపడిన యువకుడికి వైద్యం (వీడియో)

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గవర్నర్.. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.

అతడ్ని గమనించిన గవర్నర్ తమిళిసై కారు ఆపి.. అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. ఆస్పత్రి వారితో గవర్నర్ మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలన్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 telangana governor tamilisai soundararajan treated an injured youth near chennai

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించగలిగితే ప్రాణాలు నిలబెట్టినవారిమవుతామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గతంలో కూడా తమిళిసై పలువురికి వైద్యం అందించిన విషయం తెలిసిందే. ఇటీవల విమానంలో ప్రయాణిస్తూ.. అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు.

సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. డాక్టర్ వృత్తి పట్ల ఆమెకు ఉన్న అనుభవంతో ఎక్కడికి వెళ్లినా.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైనప్పుడు చికిత్స అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. గవర్నర్ పదవిలో ఉండి కూడా బాధితులకు వైద్యం అందిస్తుండటంపై సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+