తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పథకం అమల్లోకి..!
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు కీలక పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించేలా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' (IKJBP) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై త్వరలోనే విధివిధానాలు ప్రకటించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం రేపు దీనిపై భేటీ కానుంది. పథకానికి సంబంధించిన నిబంధనలను ఇతర అంశాలను ఖరారు చేయనుంది.
2026 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఇక ఈ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు స్పష్టం అవుతోంది. పేద, ధనిక అనే తేడాలు లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఈ బీమాను వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అలాగే అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇక ఇదే పథకంపై గతంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications