Huzurabad:ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఈటల ప్రధాన అనుచరుడు-ఉపఎన్నిక వేళ 'హుజురాబాద్'చుట్టే కేసీఆర్ నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా బండా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం(జులై 23) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వాసి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ ప్రతీ నిర్ణయంలోనూ ఆ నియోజకవర్గానికి కేసీఆర్ పెద్ద పీట వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
బండా శ్రీనివాస్ గతంలో విద్యార్ధి నాయకునిగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హాకీ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

గతంలో హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ గానూ, జిల్లా టెలికాం బోర్డు మెంబర్ గానూ బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ నుంచి రెండుసార్లు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించగా... శ్రీనివాస్ 2001లోనే పార్టీలో చేరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పలు హోదాల్లో శ్రీనివాస్ పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమైనా,ప్రభుత్వ కార్యక్రమమైనా దాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.
Recommended Video
ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమితులవడంలో బండా శ్రీనివాస్‌కు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే దళిత బంధు పథకాన్ని ప్రకటించి ఆ సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని కూడా ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే కట్టబెట్టారు. హుజురాబాద్‌లో దళితుల జనాభా ఎక్కువగా ఉండటంతో కేసీఆర్ ఆ వర్గం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. నియోజకవర్గంపై మున్ముందు మరిన్ని వరాల జల్లులు కురిపించే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications