తెలంగాణ యూనివర్శిటీల ఇన్‌ఛార్జ్ వీసీలు వీళ్లే
Universities in Telangana: తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు నియమితులు అయ్యారు. ఆయా యూనివర్శిటీల ఉప కులపతుల పదవీ కాలం ముగిసినందున ఇన్‌ఛార్జీలను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.మొత్తం 10 యూనివర్శిటీలకు ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు అపాయింట్ అయ్యారు. వారందరూ కూడా వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులుగా పని చేస్తోన్న సీనియర్ ఐఎఎస్ అధికారులు. విశ్వవిద్యాలయాల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగకుండా వారిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి దాన కిషోర్ నియమితులయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఇన్‌ఛార్జ్ వీసీ బాధ్యతలు బీ వెంకటేశం తీసుకున్నారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ అపాయింట్ అయ్యారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ కుమార్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్‌ను నియమించింది ప్రభుత్వం. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతిగా సురేంద్రమోహన్ అపాయింట్ అయ్యారు.
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా జయేష్ రంజన్, మహబూబ్ నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నదీం అహ్మద్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications