హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు 15 కొత్త జిల్లాలు, లాభాలివే: కొత్త జిల్లాలు ఇవేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పట్టాలపైకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా 14 లేదా 15 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఈ కొత్త జిల్లాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రకటించనున్నారు. దీనితో కొత్త, పాత జిల్లాలు కలుపుకొని తెలంగాణలో జిల్లాల సంఖ్య 24 లేదా 25కు పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్ట్ 15 నుంచి లేదా దసరా పండుగ నుంచి అధికారిక కార్యక్రమాలు చేపడతారు.

కొత్త జిల్లాలతో పాటు మరో 40 మండలాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మండలాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులకు సూచించారు. 8 నుంచి 10 మండలాలకు ఒక ఆర్డీవో ఉంటారని తెలిపారు.

K Chandrasekhar Rao

వీటిపై కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆయన ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గురువారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

కొత్త జిల్లాలతో ఇవీ లాభాలు

జిల్లాలు చిన్నవిగా ఉంటేనే సుపరిపాలన సాధ్యమవుతుందని, తెలంగాణ ఏర్పాటులాగే జిల్లాలు, మండలాల పెంపు సైతం చరిత్ర సృష్టిస్తుందని, త్వరలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగానే జిల్లాలను ఏర్పాటు చేస్తామని, ఎన్ని మండలాలు కావాలనే దానిపై పూర్తిస్థాయి కసరత్తు జరగాలని, జిల్లాల పెంపు వల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందని కెసిఆర్ అన్నారు.

వివిధ పథకాలకు గ్రాంట్లు, కొత్తగా నెలకొల్పే విద్యాలయాలు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలనే యూనిటుగా తీసుకుంటుందని, జిల్లాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతమేరకు కేంద్రం నుంచి ప్రయోజనాలు అందుతాయని, ఇది రాష్ట్రం మొత్తానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.

ప్రస్తుతం జిల్లాల్లోని ప్రాంతాలు ప్రధాన కేంద్రాలకు ఎంతో దూరంలో ఉన్నాయని, దీనివల్ల మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువలో ఉంటే వారికి సౌలభ్యంగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం అంతా హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, పరిపాలనను రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని, హైదరాబాద్‌కు దగ్గరలో ఉండి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పలు పట్టణాలను జిల్లా కేంద్రాలుగా తీర్చిదిద్దడం వల్ల వికేంద్రీకరణ సాధ్యపడుతుందని, జిల్లాలు పెరిగితే యువతకు విద్యాఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయన్నారు.

ప్రజాప్రయోజనాలు, వారి సంక్షేమమే ధ్యేయంగా ధ్యేయంగా కొత్త జిల్లాలు రావాలని, జిల్లాల పెంపును శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని, క్షేత్రస్థాయి పరిశీలనలు జరపాలని, తమ తమ పట్టణాలను, ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పరిపాలనపరమైన వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

వాట్సాప్‌లో చక్కెర్లు కొడుతున్న కొత్త జిల్లాలు!

కెసిఆర్ ఈ ప్రకటన చేయక ముందు నుంచే వాట్సాప్‌లో 24 జిల్లాలతో తెలంగాణ అని ఒకటి చక్కెర్లు కొడుతోంది. ఇవే జిల్లాలుగా ఏర్పాటు చేస్తారో లేదో కచ్చితంగా తెలియనప్పటికీ.. కొద్ది రోజులుగా ఇవే జిల్లాలు అంటూ వాట్సాప్‌లో కొన్ని పేర్లు చక్కెర్లు కొడుతున్నాయి.

1. హైదరాబాద్ సెంట్రల్, 2. హైదారాబాద్ నార్త్, 3. హైదరాబాద్ ఈస్ట్ లేదా వినోభాబావే, 4. చార్మినార్ లేదా భాగ్యనగర్, 5. గోల్కొండ, 6. వికారాబాద్, 7. అదిలాబాద్, 8. మంచిర్యాల, 9. నిజామాబాద్, 10. మెదక్, 11. సంగారెడ్డి, 12. సిద్దిపేట, 13. కరీంనగర్, 14. జగిత్యాల, 15. ఖమ్మం, 16. భద్రాచలం, 17. వరంగల్, 18. భూపాలపల్లి (జయశంకర్ జిల్లా), 19. ములుగు (సమ్మక్క సారలమ్మ జిల్లా), 20. మహబూబ్ నగర్, 21. నాగర్ కర్నూలు, 22. వనపర్తి, 23. నల్గొండ, 24. సూర్యాపేట.

English summary
The TS government has decided to increase the number of districts in the state to 24-25, including the 10 existing ones, besides an additional 40 mandals this year itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X