కోడిగుడ్లపై రంగులతో తెలంగాణా సర్కార్ ముద్ర.. ఎందుకంటే!!
తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడిగుడ్ల పై తెలంగాణ సర్కార్ ముద్ర వేయాలని నిర్ణయించింది. కోడిగుడ్లపై తెలంగాణ సర్కార్ ముద్రలా? ఎందుకు కోడిగుడ్లకు రంగులతో ముద్రలు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..
తెలంగాణ సర్కార్ దేశంలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టడానికి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వెళుతుంది. చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం కింద అంగన్వాడీ సెంటర్లలో ఇవ్వవలసిన కోడిగుడ్లు దారి మళ్లుతున్నాయి అంటూ ఇప్పటికే అనేక సందర్భాలలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చినటువంటి కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు బయటివారికి అమ్ముకోవటం, ఇళ్లకు తీసుకెళ్లి వాడుకోవడం వంటి అనేక సంఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల చోటుచేసుకుంటున్నాయి.

పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు వాళ్లకు ఇవ్వకుండా గుడ్లను మింగేస్తున్న ఘటనలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా ఉండటం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆ కోడి గుడ్ల పై రంగుల ముద్రలు వేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇక కోడి గుడ్లు ఏ జోన్ కు వచ్చినవి వంటి వివరాలు కూడా తెలిసేలాగా కోడిగుడ్డు పై జోన్ నెంబర్ తో సహా నీలం రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగులను గుడ్లకు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా విడతల వారిగా ఒక్కోసారి ఒక్కో రంగుతో ముద్రను వేసి సరఫరా చేయాలని నిర్ణయించారు.

ప్రతినెలలోనూ పది రోజులకొకసారి కోడిగుడ్ల పై ప్రత్యేక రంగుతో ముద్రలు వేసి అంగన్వాడీ కేంద్రాలకు చేర్చనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్ల పరిధిలో కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, ఇక కోడి గుడ్లు పాడై పోయినా సరే కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications