వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసి ఉద్యోగులకు మద్దతుగా పెన్ డౌన్ యోచన..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం సమ్మె ప్రభావం లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. సిబ్బందికి ఇంకా జీతాలు సైతం అందలేదు. ఇదే సమయంలో సమ్మె పైన సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు..కార్మిక సంఘాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆర్టీసి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు తెర మీదకు వచ్చాయి. వారికి సంఘీభావానికే పరిమితం కాకుండా.. రంగంలోకి దిగాలని ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు. పండుగ తరువాత సైతం సమ్మె కొనసాగే పరిస్థితుల్లో వారికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆర్టీసి సమ్మెకు మద్దతుగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా పెన్ డౌన్ ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది.

నాడు వారి మద్దతు..నేడు వీరి మద్దతు
తెలంగాణ సాధన కోసం నాడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసిన సమయంలో ఆర్టీసి కార్మికులు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. దీంతో..ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు గా నిలవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆలోచన చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం..కార్మిక సంఘాలు మొట్టు దిగటం లేద. ఇదే సమయంలో పండుగ రోజుల్లో సమ్మె చేయటం పైన సామాన్య ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే..పండుగ అయిన తరువాత సైతం ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మద్దతిచ్చిన ఆర్టీసి కార్మికులకు.. ప్రతిఫలంగా ఇప్పుడు అదే తరహాలో ఆర్టీసి కార్మికులకు అండగా నిలవాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

Telangana Govt employees thinking to support RTC workers strike may go for pendown

మద్దతుగా పెన్ డౌన్ ఆలోచన..
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సెలవులు కొనసాగుతున్నాయి. అయితే..ఈ రెండు రోజులు రద్దీ తక్కువగా ఉండటంతో పాటుగా కళాశాలలు..పాఠశాలలకు సెలవులు కావటంతో పెద్దగా ప్రభావం కనిపించటం లేదని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను ముమ్మరం చేసింది.

కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా... పెన్‌డౌన్ చేయాలని ప్రభుత్యోద్యోగులు యోచిస్తున్నట్లు సమాచారం. పండుగ తరువాత కూడా సమ్మె కొనసాగితే వారికి మద్దతుగా ఒకటి లేదా రెండు రోజులపాటు పెన్‌డౌన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత సమావేశమై చర్చించాలని ప్రభుత్యోద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) సమావేశమై ఏకాభిప్రాయం మేరకు నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.

English summary
Telangana Govt employees thinking to support RTC workers strike. After Festival JAC of telangana may go for pen down for one or two days. JAC leaders concentrated on govt decisions towards RTC employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X