తెలంగాణ యువతకు GOOD NEWS.. గడువు పెంపు

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాజీవ్‌ యువ వికాసం పథకం గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును ఏప్రిల్‌ 14 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని భట్టి తెలిపారు. దరఖాస్తుదారులకు తక్కువ కాగితపు పని ఉండేలా ఈ వెసులుబాటును కల్పించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాత కుల ధృవీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఈమేరకు కలెక్టర్లకు భట్టి సూచించారు.

Telangana Govt Extends Rajiv Yuva Vikasam Scheme Deadline to April 14

ఈ పథకం ఏంటి..?

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో ఓ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఈ పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. తాజాగా ఏప్రిల్ 14 వరకు చివరితేదీగా నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సాయాన్ని అందిస్తారు. అయితే రూ. 50 వేల వరకు 100 శాతం రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం.. రూ.1 లక్ష వరకు రుణానికి 80 రాయితీ కల్పిస్తున్నారు. అంటే.. లబ్దిదారుడు రూ.20,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రుణానికి 70 శాతం రాయితీ ఉంటుంది.దీనిలో రూ.30,000 చెల్లించాలి. రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు రుణానికి 60 శాతం రాయితీ ఉంది. లబ్దిదారుడు రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

Take a Poll

ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం https://tgobmms.cgg.gov.in/ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. అక్కడే దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+