ఇండియాటుడే అవార్డు అందుకున్న కేటీఆర్
న్యూఢిల్లీ: 'ఇండియా టుడే' సంస్థ ప్రతి సంవత్సరం ఇచ్చే 'ది స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రం ఓ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకుంది. మౌలిక వసతుల రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందంటూ 'బెస్ట్ అచీవ్ మెంట్ అవార్డు'కు ఇండియా టుడే సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... రాష్ర్టాలకు కేంద్రం స్వేచ్ఛ ఇస్తే త్వరగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు విభజన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరెంట్ సమస్యకు చంద్రబాబే కారణమని విమర్శించారు. కరెంట్ విషయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలు ముందు చంద్రబాబును నిలదీసి, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు.












Click it and Unblock the Notifications