Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళలకు నెలకు 25వేలు సంపాదించే సువర్ణావకాశం.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం మాత్రమే కాకుండా, ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారిని అన్ని రంగాలలోనూ ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో బస్సులను అద్దెకు పెట్టి, నిర్వహించడానికి అవకాశం కల్పించింది.

మహిళలకు వడ్డీ లేని రుణాలు

పెట్రోల్ బంకులు నిర్వహించడానికి, హోటల్స్ నిర్వహించడానికి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి ఆర్థిక ప్రగతి సాధించడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకుంటుంది. మహిళల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

telangana govt good news A golden opportunity for women to earn rs25 000 per month with driving

500మంది మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా శిక్షణ

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500మంది మహిళలను ఎంపిక చేసి వారికి ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా శిక్షణ ఇప్పిస్తోంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ మహిళా భద్రత విభాగం పర్యవేక్షిస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఈ విభాగం వీవీసీ మోటార్స్ అనే వాహన డీలర్షిప్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఏడాది పాటు పైలెట్ ప్రాజెక్ట్

దీని ద్వారా మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్లాన్ చేసింది. మహిళా భద్రత విభాగం కార్యాలయంలో అదనపు డీజీపీ చారుసిన్హా సమక్షంలో పోలీస్ అధికారులు vvc మోటార్స్ ప్రతినిధులు ఒప్పంద పత్రాల పైన సంతకాలు చేశారు. సంవత్సరం పాటు సాగే ఈ పైలెట్ ప్రాజెక్టు మహిళలకు చక్కటి స్వయం ఉపాధిని అందిస్తుందని పేర్కొన్నారు.

రవాణా రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర

అంతేకాకుండా ఈ ఆటోలలో మహిళా ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం పైన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఉపాధి కల్పన మాత్రమే కాదని పురుషులు ఎక్కువగా ఉండే రవాణా రంగంలో మహిళలు తమదైన ముద్ర వేయడానికి ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంటున్నారు.

మహిళలు నెలకు 15వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ఆర్జించే చాన్స్

దీని ద్వారా మహిళలు నెలకు సగటున 15వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ఆర్జించే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళా భద్రత విభాగం నేరుగా పర్యవేక్షించడం వల్ల ఈ డ్రైవర్లకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, ఇన్సూరెన్స్, లైసెన్సుల జారీ ప్రక్రియ వేగంగా సులభంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. మహిళా ఆటో డ్రైవర్ల సంఖ్య పెరిగితే మహిళా ప్రయాణికులకు రక్షణ భావం పెరుగుతుంది.

స్వయం ఉపాధితో పాటు మహిళలకు భద్రత

ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేయవలసి వచ్చే మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు మహిళ డ్రైవర్ల వాహనాలలో సురక్షితంగా వెళ్లవచ్చనే అభిప్రాయంతోనే మహిళా భద్రత విభాగం ఈ కార్యక్రమం విషయంలో చొరవ తీసుకుంది. ఏది ఏమైనా మహిళలకు స్వయం ఉపాధితో పాటు భద్రతను కల్పించే ఈ కార్యక్రమం మహిళల పురోగతికి మరింత దోహదం చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. పురుషులే అధికంగా ఉన్నా రవాణా రంగంలో ఆడ మగ తేడా లేకుండా మహిళలు కూడా దూసుకుపోవాలని కోరుతున్న వారు లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+