భూముల మార్కెట్ విలువ పెంపు - ఎక్కడ ఎంత..!!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. భూమి, నివాస, వాణిజ్య భవనాల మార్కెట్ విలువను పెంచిన రేట్లతో సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ సమీకరణపై కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి మార్కెట్ విలువలను సవరించడం ఇదే మొదటిసారి. ఈ పెంపులు మే మొదటి వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలో భూములు, నివాస, వాణిజ్య భవనాలమార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సవరణలో ప్రాంతాన్ని బట్టి వ్యవసాయ భూముల విలువ రెండు నుండి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరాకు రూ. 6 లక్షలు ఉన్న ధర, కొత్త సవరణతో రూ. 12 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు చేరవచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని భూమిలకు లెక్కలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

Telangana govt has revised the rates of the lands in the state based on certain parameters and will issue orders soon

బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసరాల్లో 300 శాతానికి పైగా పెంపును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రీజినల్ రింగ్ రోడ్ (RRR), భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల కారణంగా డిమాండ్ పెరిగిన ప్రాంతాల్లో భూముల విలువలు మూడు రెట్లు పెరగవచ్చని అంచనా. ఖాళీ ప్లాట్లు, నివాస లేఅవుట్‌ల ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

అపార్ట్‌మెంట్ ధరలు స్వల్పంగా సవరించవచ్చు. చదరపు అడుగుకు సుమారు రూ. 2,200 నుండి రూ. 2,800 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగినప్పటికీ, ఈ చర్య బ్లాక్ మనీ లావాదేవీలను తగ్గించి, పారదర్శకతను మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల కంటే వాణిజ్య ఆస్తుల ధరలు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలలో వాటి విలువలను కొద్దిగా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రాష్ట్రంలో కొత్త కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు, ఆస్తుల విలువలను చదరపు అడుగుకు రూ. 7,000 నుండి రూ. 6,500కు తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం హిల్ట్ పాలసీని వేగవంతం చేయాలని భావిస్తోంది.కాగా, ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య చైనా తరహాలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+