రేవంత్ అధికార ప్రక్షాళన - అమ్రపాలీకి కీలక బాధ్యతలు..!!
తెలంగాణలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగ ప్రక్షాళన పై ఫోకస్ చేసారు. ఐఏఎస్ అధికారుల బదిలీ పైన సుదీర్ఘంగా కసరత్తు చేసారు. ఇప్పుడు ఒకే సారి 44 మంది కీలక అధికారుల బదిలీల పై ఉత్తర్వులు జారీ చేసారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లోనూ సీనియర్లకు ప్రధాన బాధ్యతలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
తెలంగాణలో వివిధ శాఖల్లో పని చేస్తున్న 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ గా నరసింహారెడ్డి, జలమండలికి ఎండీగా అశోక్ రెడ్డి, సెర్ప్ సీఈవోగా దివ్య, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, ఎక్సైజ్ బాధ్యతలు రిజ్వికి అప్పగించారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోస్ ను కీలకమైన ట్రాన్స్ కో ఎండీగా బదిలీ చేసారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ గా మహిళా ఐఏఎస్ అమ్రపాలీకి ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు అప్పగించారు.

పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ కు బాధ్యతలు కేటాయించిన ప్రభుత్వం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ ను నిమమించింది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ గా ఏవీ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ను నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications