ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక నుంచి..!!
ఉద్యోగులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య పథకంలో మార్పులకు సిద్దమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయనుంది. ఈ కొత్త పథకం పైన ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో, ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవ్వాలని నిర్ణయించనున్నారు. పాత పథకంలో ఉన్న పలు లోపాలను సవరించి కొత్త ఆరోగ్య పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఆరోగ్య పథకానికి 'న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం'గా వ్యవహరించాలని నిర్ణయిచారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు కానుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అందిస్తున్నారు. ఈ సేవలు నామమాత్రంగానే ఉన్నాయనే అభిప్రాయం ఉద్యోగుల్లో కనిపిస్తోంది.

కాగా, బకాయిలు సరిగా చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కార్డులు కొన్నిచోట్ల చెల్లుబాటు కావడం లేదని ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. మొదట నగదు చెల్లించి, క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ మొత్తం నగదు తిరిగి రావడం లేదన వాపోతున్నారు. దీంతో ఉద్యోగులు కాస్త ఇబ్బందులకు గురవుతున్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఉద్యగుల కాంట్రిబ్యూషన్ పైనా తాజాగా కీలక ప్రతిపాదన చేసారు.
ఉద్యోగుల భాగస్వామ్యంతో
ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు కొత్తగా అమలయ్యే పథకంలో ఉద్యోగుల బేసిక్ నుంచి ఒకటిన్నర శాతం నగదు భాగస్వామ్యంతో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి రూ.50 వేల బేసిక్ ఉంటే నెలకు రూ.750 వరకు కొత్త పథకంలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గురువారం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ పథకం అమలు విధి విధానాలపై పూర్తి స్పష్టత రానుంది.
తొలుత ఈ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయాలనుకున్నా తర్వాత ట్రస్టు విధానంలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలోనే ఇది కొనసాగనుంది. ఉద్యోగుల బకాయిల విషయంలోనూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెలా విడుదల చేస్తోంది. ఇక, ఆరోగ్య శ్రీ పథకంలోనూ కొత్త మార్పులు.. ఉద్యోగుల భాగస్వామ్యం తో కలిపి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications