వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రైతు రాజ్యం, రూ.25 వేల లోపు రుణాలకు నిధులు, రైల్వేకు రూ.4 కోట్లు: కేసీఆర్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వకుండా.. పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆల్ పార్టీ పేరుతో వెళ్లిన పార్టీ ప్రతినిధులను ప్రజలే స్వాగతించలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం అని మరోసారి స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పాలిత రాష్ట్రాలు కూడా ధాన్యం కొనలేదని వివరించారు. కాంగ్రెస్ నేతల వలలో రైతులు పడొద్దని సూచించారు. 35 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. వారికి చేస్తున్న మంచిని గుర్తుంచుకోవాలని కోరారు.

 35 వేల కోట్లు...

35 వేల కోట్లు...

వరి ధాన్యమే కాకుండా కందులు, శనగలు, పచ్చ జొన్నలు కూడా కొనుగోలు చేశామని చెప్పారు. పొరుగున గల ఛత్తీస్ గడ్‌లో క్వింటా వరికి రూ.2500 ఇస్తామని చెప్పారని.. కానీ ఎకరాకు 15 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. మిగిలిన ధాన్యాన్ని భూపాలపల్లి తీసుకొస్తున్నారని తెలిపారు. ఒకేసారి రూ.2 లక్షల రుణం ఇస్తామని చెప్పి కూడా మాట తప్పారని గుర్తుచేశారు.

1200 కోట్లు..

1200 కోట్లు..

రైతుబంధు పథకం కొనసాగుతోందని కేసీఆర్ స్పష్టంచేశారు. రూపాయి కూడా తగ్గింబోమని.. వానకాలం కోసం రూ.7 వేల కోట్లు అందజేస్తామని చెప్పారు. 25 వేల లోపు రుణం తీసుకున్నవారికి రూ.1200 కోట్లను బుధవారం మంజూరు చేస్తున్నామని తెలిపారు. పెన్సన్లు ఇస్తామని.. పేదలు, రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పారు. దేశంలో 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని.. తర్వాత ఏపీ, తమిళనాడు ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో 8 గంటలు ఉచిత కరంట్ ఇస్తున్నారని తెలిపారు.

Recommended Video

Viral Video : Watch How People Are Crazy To Get Wine | Oneindia Telugu
 4 కోట్లు

4 కోట్లు

కాంగ్రెస్ పార్టీతోపాటు కేంద్రంలోని బీజేపీపై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆర్థికమాంద్యం ఉన్న కేంద్రం.. ఎందుకు నిజాన్ని దాస్తుందని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిధి పెంచాలని కోరినా స్పందించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ నుంచి ఆర్బీఐ 2500 కోట్లు వసూల్ చేసిందని వివరించారు. వలస కూలీల టికెట్ కూడా వారినే పెట్టుకొవాలని కేంద్ర అనడం భావ్యం కాదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్రం రూ.4 కోట్లు కట్టిందని గుర్తుచేశారు.

English summary
telangana govt release 1200 crores for farmers 1200 crores Loan cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X