తెలంగాణ కొత్త సచివాలయానికి రూ.150 కోట్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ అంశాల ఖరారుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. పురపాలక, రెవెన్యూ ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శి భ్యులుగా, రహదారులు, భవన కార్యదర్శి సభ్య కార్యదర్శిగా ఉంటారు.

భవన నిర్మాణ ఆకృతులు, కార్యాలయాల స్థలాల ఎంపిక తదితర అంశాలను ఖరారు చేసేందుకు అయిదుగురు సీనియర్‌ ఐఏఎస్‌లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

Telangana Govt releases 150 crores for New Secretariat

ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డ ఛాతీవ్యాధుల ఆసుపత్రిలోని 72 ఎకరాల్లో కొత్త సచివాలయ సముదాయాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయాన్ని అక్కడికి తరలించనుంది. ముఖ్యమంత్రి నివాస గృహం, శాఖాధిపతులు, ఉద్యోగుల నివాస గృహాలను కూడా అక్కడే నిర్మించనున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు భూబదలాయింపు, ప్రణాళిక, ఆకృతుల రూపకల్పన, ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన కార్యాలయ అధికాలుకు అవసరమైన స్థలం, మంత్రులు, వారి సిబ్బందికి కార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు.. ఇలా ఏ కార్యాలయం ఎక్కడ ఉండాలనే విషయమై ఉన్నతస్థాయి కమిటీ ఖరారు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+