బడ్జెట్ వేళ ఉద్యోగులకు తీపి కబురు, నేరుగా ఖాతాల్లో జమ..!!
కేంద్ర బడ్జెట్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఆదాయపు పన్ను సహా పలు రంగాల్లో కీలక సంస్కరణలను ప్రస్తావించారు. న్యూ ఇన్‌కంట్యాక్స్ యాక్ట్ -2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సామాన్యులు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఫారమ్‌లను సరళతరం చేసామని చెప్పారు. ఎన్ఆర్ఎస్ కింద టీసీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించామన్నారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇటు రాష్ట్రం లో ఉద్యోగులకు తీపి కబురు అందింది.
అటు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన సమయంలోనే.. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలను విడుదల చేసింది. పెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సమయం లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విడతల వారీగా పెండింగ్ నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

విడతల వారీగా చెల్లింపు
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ. 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్ లు, అడ్వాన్సులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications