తెలంగాణలో రైతు రుణమాఫీపై కొత్త మెలిక- అది పూర్తయిన తరువాతే నిధులు డిపాజిట్?
Revanth Reddy: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతు రుణ మాఫీకి సంబంధించిన నిర్ణయం అది. పంట రుణాల మాఫీ విషయంలో చివరి నిమిషంలో కొత్త మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని ఇంకా ముందుకు జరిపింది. 18వ తేదీ నాడే తొలి విడత నిధులను మంజూరు చేసింది. అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. దీనికి సంబంధించిన నిధులనూ విడుదల చేసింది.

అదే సమయంలో- రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను తెరమీదికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకుని మలి విడతలో ఆగస్టు 15వ తేదీ లోపు విడుదల చేయదలిచిన పంట రుణాల మాఫీ నిధులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెబుతున్నారు.
ఆ నిబంధన- ప్రీ ఆడిట్ విధానం. పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆడిట్ పూర్తయిన తరువాతే రుణ మాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోన్నట్లు సమాచారం. దీని కోసం సుమారు 16,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా రైతులు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తంలో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడమే దీనికి కారణమని అంటున్నారు. అలాంటి ఖాతాలు ఎన్ని ఉన్నాయనే విషయంపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని, అది పూర్తయిన తరువాతే రుణ మాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications