హైదరాబాద్ మెట్రోపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఫేస్ 2 కోసం వేల కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతోంది.

ఇదివరకు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. అప్పట్లోనే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయనకుఅందజేశారు. అవుటర్ రింగ్ రోడ్, రింగ్ రైల్వే ప్రాజెక్టు, హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్.. వంటి ప్రతిపాదనలు మోదీకి అందజేసిన వాటిల్లో ఉన్నాయి.

Telangana govt Sanctions funds for Hyderabad Metro Phase-2

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2ను విస్తరించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు ప్రధాని ముందుంచారు. మెట్రో రైల్ ఫేజ్-1లో 69 కిలో మీటర్లతో కూడిన మూడు కారిడార్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను 22,000 కోట్ల రూపాయలతో నిర్మించదలచినట్లు వివరించారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లో ముందడుగు పడింది.

19,579 కోట్ల రూపాయలతో ఫేస్ 2 (బీ) కారిడార్ నిర్మాణ పనులకు రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫేస్- 2 (బీ) కోసం జాయింట్ వెంచర్ గా నిధులను సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 5,874 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే మొత్తంలో అధికశాతం వాటా ప్రభుత్వానిదే. 30 శాతం వాటా పెట్టనుంది.

కేంద్ర ప్రభుత్వం నుండి 3,524 కోట్ల రూపాయలను తీసుకోనుంది. కేంద్రం వాటా 18 శాతం. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ నుంచి 9,398 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఆయా బ్యాంకులన్నింటి వాటా 48 శాతంగా ఉంటుంది. ఇక పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కింద 783 కోట్ల రూపాయలను సేకరిస్తుంది. పీపీపీ వాటా నాలుగు శాతంగా నిర్ధారించింది. ఈ మేరకు మెట్రో పాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి ఇళంబర్తి జీవో జారీ చేశారు.

గత ఏడాది అక్టోబ‌రులో చెన్నై మెట్రో ఫేజ్‌-2కు రూ. 63,246 కోట్లు, 2021 ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-2కు రూ. 14,788 కోట్లు, 2024 ఆగ‌స్టులో బెంగ‌ళూర్ మెట్రో ఫేజ్-3కి రూ. 15,611 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు సంబంధించి గత ఏడాది నవంబర్ 4వ తేదీన కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు స‌మ‌ర్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+