రైతుభరోసా సీలింగ్ పై నిర్ణయం - వారి నుంచి రకవరీ..!!
తెలంగాణ ప్రభుత్వం రైతుభరసా పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.అర్హులకు పథకం అమలు చేయాలని నిర్ణయించింది. అనర్హులు ఈ పథకం నుంచి లబ్ది పొందితే వారి నుంచి రికవరీ చేయాలనే ఆలోచనతో ఉంది. తాజాగా మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తోంది. విధి విధానాల ఖరారుతో పాటుగా అర్హత..సీలింగ్ గురించి ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.
మంత్రుల మంత్రాంగం
తెలంగాణలో రైతభరోసా పథకం పైన కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఆర్థిక సాయం ఎవరికి చేయాలి, ఎవరిని లిస్ట్ లోనుంచి తొలగించాలి అనే విషయంలో మంత్రుల కమిటీ రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఆర్థిక సాయం ఎవరికి చేయాలి, ఎవరిని లిస్ట్ లోనుంచి తొలగించాలి అనే విషయంలో సూచనలు, సలహాలు స్వకరిస్తున్నారు. రైతుబంధుని రైతు భరోసాగా మార్చుతూ వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది.

రైతులతో చర్చలు
అయితే ఇంతవరకు దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాలేదు. రైతుల అభిప్రాయాలు సేకరించినప్పుడు గరిష్టంగా 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికే రైతుభరోసా నిధులు జమచేయాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా పీటముడి పడే అవకాశముంది. తమ పొలాలను కౌలుకి ఇచ్చే యజమానులు అంగీకార పత్రాలు తీసుకునే సందర్భాలు అరుదు. ఈ అంగీకార పత్రాలు ఉంటేనే కౌలు రైతుల్ని గుర్తించి వారికి ఆర్థిక సాయం చేసే అవకాశముంటుంది. దీనిపై కూడా రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు మంత్రులు. అంగీకార పత్రాలు ఇచ్చేందుకు యజమానులు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
సీలింగ్ పై నిర్ణయం
పలువురు రైతులు మాట్లాడుతూ..సాగు భూములకే రైతు భరోసా అందించాలనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయంలో కొండలు, గుట్టలు, పడావు బడ్డ బంజరు భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధును అందించి కోట్లాది రూపాయల నిధులను దుర్వినియో గం చేసిన నేపథ్యంలో కేవలం పంటలను సాగు చేసే రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. సన్న, చిన్న, మధ్యతరగతి రైతులందరికీ మేలు జరిగేలా కేవలం 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ సాయం అందించాలని మెజార్టీ రైతులు సూచించారు. ఇదే నిర్ణయం పై అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications