తెలంగాణకు గుడ్ న్యూస్..రాకెట్ తయారీ కంపెనీతో కీలక ఒప్పందం

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎ రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగానే మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.

ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. స్కైరూట్ ఏరో స్పేస్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడానికి ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు.

Telangana Govt signs deal with Skyroot Aerospace

స్కైరూట్‌ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందని అన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం మాకు సంతోషంగా ఉందని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+