గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ: సినీ ఫక్కీలో మంకీక్యాప్స్, గ్యాస్ కట్టర్లతో రూ. 3.5 కోట్ల చోరీ

నిజామాబాద్: జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 3.5 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. నిన్న ఆదివారం కావడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది.

బ్యాంక్ లాకర్లలోని రూ.7.22 లక్షలు, రూ.2 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు దొంగలు అపహరించారు. శనివారం రాత్రి చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చోరీ జులాయి సినిమాలో బ్యాంక్ చోరీ సంఘటనను తలపించేలా చోటు చేసుకోవడం గమనార్హం.

Telangana grameena bank robbery in nizamabad district: 3.5 crore theft

మొదట బ్యాంక్ షట్టర్ తెరిచి లోపలికి ప్రవేశించిన దొంగలు సీసీటీవీ కెమెరాల వైర్లను ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్లతో లాకర్లను తెరిచి నగదుతోపాటు బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ప్రత్యేక క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మంకీని పోలిన మాస్కులు ధరించిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సమీపంలోని సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ భారీ బ్యాంక్ చోరీ స్థానికంగా కలకలంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+