టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థుల భారీ ఆందోళన: పరీక్ష వాయిదాపై టీఎస్‌పీఎస్సీ క్లారిటీ

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయం నుంచి సుమారు 2వేల మంది అభ్యర్థులు ర్యాలీగా వచ్చారు. భారీ ఎత్తున అభ్యర్థులు చేరుకోవడం, పరీక్ష వాయిదా వేయాలంటూ నినాదాలు చేయడంతో టీఎస్‌పీఎస్సీ ప్రాంగణం మారుమోగింది.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్-2 అభ్యర్థులకు మద్దతు పలికారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Telangana group 2 candidates protest at tspsc office to postpone exams

కమిషన్ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలోకి అభ్యర్థులను తరలించారు. దీంతో అక్కడే కూర్చుని అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని బోర్డ్ కార్యదర్శి అనిత రామచంద్రన్ కు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, డాక్టర్ రియాజ్, తదిరులు వినతి పత్రం అందించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ లేకపోవడంతో ఉన్నతాధికారులను సంప్రదించి పరీక్ష వాయిదా అంశంపై వెల్లడిస్తామన్నారు అధికారులు.

గ్రూప్-2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. అయితే, ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్-2, గురుకుల పరీక్ష నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సిద్ధం కావాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేగాక, గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్(ఎకానమీ)లో గతంలోని సిలబస్ కు అదనంగా 70 శాతం కలిపారని, అందుకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోతున్నామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. ఈ అవకాశం కల్పిస్తే తమకు చదువుకునేందుకు సమయం దొరుకుతుందన్నారు.

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అభ్యర్థులతో కలిసి నిరసనలో పాల్గొన్న ఆయన.. విద్యార్థుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలన్నారు. ప్రస్తుతం జేఎల్, గ్రూప్2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షలను 3 నెలలపాటు వాయిదా వేయాలన్నారు. మరోవైపు, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఏడుళ్లు ఆగిన ప్రభుత్వం.. మూడు నెలలు ఆగలేదా? అని ప్రశ్నించారు.

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయలేదు: టీఎస్‌పీఎస్సీ

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ స్పష్టతనిచ్చింది. పరీక్షలు వాయిదా వేయలేదని తెలిపింది. ప్రస్తుతం టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేరని.. ఆయనను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందుకు రెండు రోజుల సమయం పడుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+