Krishna Water: ఏపీ వాటాకు మించి నీటిని వాడుకుంది.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ..
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా బేసిన్ లో ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీళ్లు వాడుకుందని లేఖలో వివరించింది. ఇక నుంచి నీటిని తీసుకోకుండా ఏపీని అదుపు చేయాలని కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్ శివ్ నందన్ కుమార్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఏపీ 71.71 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొన్నారు.
ఏపీలోని రిజర్వాయర్లలో ఇప్పటి వరకు 46.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఇప్పటి వరకు 22.21 టీఎంసీలు వినియోగించుకుందని.. తెలంగాణలో ప్రాజెక్టుల్లో 11.79 టీఎంసీల నిల్వ ఉన్నయాని లేఖలో ప్రస్తావించారు. గతేడాది నిల్వ ఉంచుకున్న 18.70 టీఎంసీలు కలుపుకుని 87.49 టీఎంసీల వాట తెలంగాణకు దక్కుతుందన్నారు. ఈ విషయమై ముగ్గుర సభ్యుల కమిటీలో చర్చించాలని కోరారు.

ఏపీ నీటి తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. కాగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ, తెలంగాణ సమర్పించిన ఇండెంట్లపై చర్చించేందుకు ఈనెల 11న కేఆర్ఎంబీ ముగ్గురు సభ్యల కమిటీ చర్చించనున్నారు.
సాగు, తాగునీటి అవసరాలకు 38.73 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ ఇండెంట్ సమర్పించింది.
అటు ఆంధ్రప్రదేశ్ 30.09 టీఎంసీలు ఇండెంట్ లో కోరింది. ఆగస్టు 21న కేఆర్ఎంబీ మెంబర్‌సెక్రటరీ డీఎం రాయ్ పురే అధ్యక్షతన నిర్వహించిన త్రీమెంబర్ కమిటీ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరుకాలేదు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ తప్పుబట్టింది. ఈనేపథ్యంలో 11న జరిగే సమావేశం కీలకం అయ్యే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు లేకపోవడంతో రెండు రాష్ట్రాల నీటి వినియోగానికి అనుమతి ఇస్తారా లేదో చూడాలి.












Click it and Unblock the Notifications