వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్; మరో మూడు వారాలు అలెర్ట్: తెలంగాణా హెల్త్ డైరెక్టర్ సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఇది ప్రమాదకరమైన స్థాయిలో వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతోందని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం

వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకమని ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నదాని కంటే శర వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. రానున్న రోజుల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఒమిక్రాన్ కేసుల్లో 90 శాతం మందికి లక్షణాలు లేవు

ఒమిక్రాన్ కేసుల్లో 90 శాతం మందికి లక్షణాలు లేవు


ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని, 10 శాతం మందికి మాత్రమే లక్షణాలు బయటపడుతున్నాయి అని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఆ పది శాతం మంది వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని, మనదేశంలోనూ ఒమిక్రాన్ కేసులు బాగా పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒమిక్రాన్ 30 రెట్లు వ్యాప్తి

ఒమిక్రాన్ 30 రెట్లు వ్యాప్తి

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కేసులు ఎక్కువయ్యాయని పేర్కొన్న ఆయన ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలన్నారు.
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మూడు రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని మొదట చెప్పారని, తరువాత ఆరు రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని , కానీ 30 రెట్లు అదనంగా వ్యాప్తి చెందుతుందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు వేవ్ లలో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని ప్రజలను ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

సంక్రాంతి తరువాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం

సంక్రాంతి తరువాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం


ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం నిబంధనలను పాటించాలని, చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. నూతన సంవత్సర వేడుకలలో జాగ్రత్తలు తీసుకోవాలని, సంక్రాంతి తరువాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. యూకే, యూఎస్ వంటి దేశాలలో ఒక్కసారిగా కేసులు లక్షల్లోకి పెరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

 దేశంలో తెలంగాణా ఒమిక్రాన్ కేసుల్లో ఆరో స్థానం

దేశంలో తెలంగాణా ఒమిక్రాన్ కేసుల్లో ఆరో స్థానం


దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోనూ పంజా విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలోనే తెలంగాణ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసుల నమోదు లో ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ 263 కేసులతో మొదటి స్థానంలోనూ మహారాష్ట్ర 252 కేసులతో రెండవ స్థానంలోనూ ఉండగా ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్, కేరళ ఉన్నాయి. ఇక ఆరవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్య శాఖ అధికారులు.

English summary
Dr. Srinivas, Director, Telangana State Public Health Department, said that the omicron cases rise is a indiction of third wave. Dr Srinivas said that omicron spread 30 times much faster and people to take precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X