వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: బీఎఫ్ 7 వేరియంట్‍పై అప్రమత్తమైన తెలంగాణ..!

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో మళ్లీ కరోనా భయాలు అలుముకున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ దేశం చైనాలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతుండడంతో పాటు మరణాలు కూడా పెరిగాయి. చైనా జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ భారీగా కేసులు పెరిగాయి. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోయినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. భారత ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసింది.

బీఎఫ్ 7 వేరియంట్

బీఎఫ్ 7 వేరియంట్

చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని మీడియా కథనాలు వస్తున్నాయి. భారత్ లో కూడా చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ ప్రవేశించింది. గుజరాత్ లోని ఓ ఎన్ఆర్ఐ మహిళలో ఈ వేరియంట్ ను గుర్తించగా.. తాజా ఒడిశాలో మరో బీఎఫ్ 7 వేరియంట్ కేసు నమోదు అయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

హరీశ్‌రావు సమీక్ష

హరీశ్‌రావు సమీక్ష

బీఎఫ్7 వేరియంట్ పై గురువారం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. అయితే మన దగ్గర బీఎఫ్7 వేరియంట్ ప్రభావం అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటీకి కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు.
ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల్లో మినహా.. మిగతా చోట్ల జీరో కొవిడ్‌ కొనసాగుతోంది.

పాఠశాలల్లో మాస్క్

పాఠశాలల్లో మాస్క్

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్‌లోని చాలా పాఠశాలలు తప్పనిసరిగా మాస్క్ నిబంధనను తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని ఇతర పాఠశాలలు ముసుగు నిబంధనలు తొలగించలేదని తెలిపాయి. పిల్లలు అందరు మాస్కులు ధరించేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పాయి.

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

కాగా తాజాగా ఏసుక్రీస్తు దయ వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డీహెచ్ శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని.. దానిని అందరూ ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఆధునిక సంస్కృతి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ.. అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులు. ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేదని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

శ్రీనివాసరావు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ఏమాత్రం తగదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా మాట్లాడటం మంచిది కాదన్నారు.

English summary
Health Minister Harish Rao will conduct a review on the BF7 variant on Thursday. But experts say that the effect of BF7 variant will not be that much with us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X