వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హృతిక్ రోషన్.. కల్ట్‌ఫిట్ కేసులో రిలీఫ్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు రిలీఫ్ దొరికింది. కల్ట్‌ఫిట్ కేసులో ఆయనపై పోలీసులు ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మోసానికి పాల్పడ్డారంటూ శశికాంత్ అనే వ్యక్తి హృతిక్ రోషన్‌తో పాటు డైరెక్టర్లు, మేనేజర్‌‍పై కూకట్‌పల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాని ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హృతిక్ రోషన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులతో పాటు ఫిర్యాదుదారుడైన శశికాంత్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదావేసింది. అప్పటి వరకు హృతిక్ రోషన్‌తో పాటు మరో ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

కల్ట్‌ఫిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్

కల్ట్‌ఫిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్

కల్ట్ ఫిట్.. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఫిట్‌నెట్ సెంటర్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దేశవ్యాప్తంగా సెంటర్లు ఏర్పాటు చేసిన ఈ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్‌ను నియమించుకుంది. వివిధ రకాల ప్యాకేజీలతో ఆకట్టుకునే ఆఫర్లు ఇవ్వడంతో కల్ట్‌ఫిట్‌లో జాయిన్ అయ్యేందుకు చాలా మంది మొగ్గుచూపారు. కస్టమర్లు యాప్ ద్వారా సెషన్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అవడం.. హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్‌ కావడంతో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇదే అదునుగా కంపెనీ సామర్థ్యానికి మించి కస్టమర్లను చేర్చుకుంది.

స్లాట్లు దొరకక ఇబ్బందులు

స్లాట్లు దొరకక ఇబ్బందులు

దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కల్ట్ ఫిట్ హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 3లో సెంటర్ ఏర్పాటు చేసింది. వెయిట్‌లాస్, ఫిట్ నెస్, యోగా తదితర సెషన్ల కోసం ఏడాదికి రూ.17,490 నుంచి 36వేల ఫీజుతో ప్యాకేజీలు ప్రకటించడంతో చాలా మంది మెంబర్‌షిప్ తీసుకున్నారు. అయితే పరిమితికి మించి సభ్యులు చేరడంతో స్లాట్ దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ మాత్రం స్పందించలేదు.

మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు

మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు

స్లాట్ దొరకక ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు కల్ట్‌ఫిట్ నిర్వాహకులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శశికాంత్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వేలకు వేలు ఫీజులు కట్టించుకుని స్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. కల్ట్ ఫిట్ నిర్వాహకులతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న హృతిక్ రోషన్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో పోలీసులు హృతిక్ రోషన్‌తో పాటు కల్ట్ ఫిట్ డైరెక్టర్ ముకేశ్ బాంచల్, సీఈఓ అంకిత్, మేనేజర్ సుబ్రమణ్యంపై ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసు నమోదుచేశారు.

English summary
Giving relief to Bollywood actor Hrithik Roshan and three others, the Telangana High Court directed the TS police not to take coercive steps against them in a case charging them with cheating and criminal breach of trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X