తెలంగాణలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు: కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

శుక్రవారం వినాయక చవితి కావడంతో రాష్గ్రంలో వినాయక మండపాలు రూపుదిద్దుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. హుస్సేన్ సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని పేర్కొన్న హైకోర్టు.. పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్క్ రోడ్డు తదితర ప్రాంతాల్లో చేసుకోవచ్చని తెలిపింది. హుస్సేన్‌సాగర్‌‌లో రబ్బరు డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఒకే రోజు కాకుండా ప్రణాళిక ప్రకారం అనుమతించాలని పోలీసులకు సూచించింది.

గణేష్ మండపాల ఏర్పాటుపై హైకోర్టు హెచ్చరికలు

గణేష్ మండపాల ఏర్పాటుపై హైకోర్టు హెచ్చరికలు

చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేయాలనీ ప్రజలకు కోరింది. నిమజ్జన ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు పంపిణి చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలిపింది. వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా మండపాల ఏర్పాటు ఉండాలని సూచించింది. రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని హైకోర్టు హెచ్చరించింది. మండపాల దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని తెలిపింది. తమ ఆదేశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇక రాత్రి 10 గంటల తర్వాత మైకులను అనుమతించొద్దని వెల్లడించింది. వినాయకమండపాల వద్ద శానిటైజర్ ఉంచాలని తెలిపింది.

ఏపీలో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు ఇలా..

ఏపీలో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు ఇలా..

ఇది ఇలావుండగా, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ రాష్ట్ర హైకోర్టు పలు ఆంక్షలను విధించింది. ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు.. కరోనా నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవచ్చిని స్పష్టం చేసింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. అటు పబ్లిక్‌ ప్లేస్‌లలో నవరాత్రి వేడుకలు జరుపుకోవద్దని తెలిపింది. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. అయితే ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం.. మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో కోవిడ్‌ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+