వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఆంధ్రా పాలకుల అంచనాలు తలకిందులు చేసిన కెసిఆర్’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అవసరాలకు సరిపడ విద్యుత్‌ను సరఫరా చెసే శక్తి సామర్ద్యాలు తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుందని తెలంగాణ ఇంధన శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఏక కాలం లో 12,500, మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

తెలంగాణ విడిపోతే కరెంట్ కస్టాలు ఉంటాయని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది నిజమేనని అంగీకరిస్తూనే.. ఆంధ్ర పాలకుల అంచనాలు తల కిందులు చేస్తూ నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప తనమేనని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వర్షాలతో ఏర్పడ్డ పరిస్థితులపై బుధవారం సచివాలయంలో విద్యుత్ అధికారులు దేవులపల్ల ప్రభాకర్ రావు , రఘుమా రెడ్డి , వెంకటనారయణలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముందెన్నడూ లేని రీతి లో ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో 7194 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చందన్నారు. 2014, 2015 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం చివరికి 533 మెగావాట్ల డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు.

2014 ఏప్రిల్ మాసంలో 6493 మెగావాట్ల డిమాండ్ ఉన్న విద్యుత్.. 2015 ఏప్రిల్ మాసంలో 6661 మెగావాట్ల డిమాండ్‌కు పెరిగితే.. అది ఈ సంవత్సరానికి ఏకంగా 7194మెగావాట్లకు పెరిగి పోయిందని ఆయన వివరించారు. 235 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇది సాధ్యమైంన్నారు. ఇప్పటి వరకు పాలించినవారి పాలనలో 640 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేపట్టిన అనతి కాలంలోనే 236 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తాజాగా రాష్ట్రంలో సంభవించిన వర్షాలకు విద్యుత్ శాఖకు రూ. 5కోట్ల నస్టం వాటిల్లిందన్నారు. ముందెన్నడూ లేని రీతిలో వచ్చిన ఈదురు గాలులతో టియస్ యస్‌పి‌డియల్ పరిధిలో 454 /11కేవీ ఫీడర్లు, 33కేవీ ఫీడర్లు 7, యల్‌టి లైన్‌లు 668, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మార్లతో పాటు మరో మూడు పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు.

అదేవిధంగా టియస్‌ యన్‌పిడిసియల్ పరిధిలో 2360 కరెంట్ పోల్స్ , 77 పోల్స్ 33 కేవీ, 5494 పోల్స్ యల్‌టి పోల్స్, 595 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయని మంత్రి చెప్పారు. వీటిపై అందిన 19 వేల ఫిర్యాదుల్లో 90 శాతం పరిష్కారించబడ్డాయన్నారు.

వర్షలకు చిన్నాభిన్నమైన విద్యుత్ వ్వవస్థ‌ను ఆగమేఘాల మీద మరమ్మతులు జరిపించి సరఫరాను పునరుద్దరించడం విద్యుత్ శాఖలో పని చేస్తున్న లైన్‌మెన్ నుండి ఆ శాఖా ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు , రఘుమారెడ్డి , వెంకటనారయణల వరకు చేసిన కృషికి ఫలితమేనని మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ సిబ్బందిని ప్రశంసించారు. విద్యుత్ శాఖా వినియోగదారులకు మరింత చేరువై సేవలను విస్తరించేందుకు త్వరలో "అన్డ్రాయిడ్ యాప్ "ను ప్రారంభించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

జగదీష్ రెడ్డి

జగదీష్ రెడ్డి

అవసరాలకు సరిపడ విద్యుత్‌ను సరఫరా చెసే శక్తి సామర్ద్యాలు తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుందని తెలంగాణ ఇంధన శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

జగదీష్ రెడ్డి

జగదీష్ రెడ్డి

ఏక కాలం లో 12,500, మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

జగదీష్ రెడ్డి

జగదీష్ రెడ్డి

తెలంగాణ విడిపోతే కరెంట్ కస్టాలు ఉంటాయని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది నిజమేనని అంగీకరిస్తూనే.. ఆంధ్ర పాలకుల అంచనాలు తల కిందులు చేస్తూ నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప తనమేనని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

జగదీష్ రెడ్డి

జగదీష్ రెడ్డి

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వర్షాలతో ఏర్పడ్డ పరిస్థితులపై బుధవారం సచివాలయంలో విద్యుత్ అధికారులు దేవులపల్ల ప్రభాకర్ రావు , రఘుమా రెడ్డి , వెంకటనారయణలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

English summary
Energy Minister Jagadish Reddy on Wednesday claimed that the Telangana State was able to bridge the demand-supply gap of energy and today it was in a position to supply 12,400 MW.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X