వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో అధికంగా బీపీ - షుగరు వ్యాధి : జాతీయ సగటు కంటే - అపోలో సర్వేలో వెల్లడి..!!

By
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో హైపర్‌టెన్షన్ ..డయాబెటిస్ ఉన్న వారి సంఖ్య విస్తరిస్తోంది. జాతీయ సగటు స్థాయిని దాటుతోంది. తాజాగా అపోలో ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక లో పలు కీలక అంశాలను వెల్లడించింది. అందులో దేశ వ్యాప్తంగా హైపర్ టెన్షన్ - డయాబెటిస్ రెండూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా గుర్తించారు. ఈ నివేదిక వెల్లడించిన సమాచారం మేరకు.. తెలంగాణలో మధుమేహం వ్యాప్తం 8 శాతం కంటే ఎక్కువగా ఉన్న కేటగిరీలో ఉందని గుర్తించింది. ఇది దేశంలోనే అధికమని చెప్పుకొచ్చింది. ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా మరో ఏడు రాష్ట్రాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.

Recommended Video

Telangana : తెలంగాణలో 8 శాతం కంటే ఎక్కువగా Hypertension - Diabetes | Oneindia Telugu

జాతీయ సగటు 7 శాతంగా ఉండగా.. తెలంగాణలో మాత్రం దానిని అధిగమించి విస్తరిస్తున్నట్లుగా తేల్చారు. ఇక, హైపర్ టెన్షన్ తో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రోజు రోజుకీ దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రక్తపోటు పరంగా జాతీయ సగటు 8 శాతం కాగా, తెలంగాణలో అది 8.18 నుంచి 11 శాతం వరకు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అపోలో మెడికల్ హిస్టరీ డేటా, ల్యాబ్ నివేదికలు, పరీక్షల ఆధారంగా ఈ ఫలితాలను గుర్తించినట్లు సర్వేలో స్పష్టం చేసారు. దేశంలో మధుమేహం 7 శాతం, రక్తపోటు 8 శాతానికి పైగా, సిఓపిడి.. ఆస్తమా 2 శాతం ఉన్నట్లు డేటా సూచిస్తోందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వివరించారు.

Telangana is one of the states in India with a high prevalence of both hypertension and diabetes: Apollo Hospitals survey

కోవిడ్ -19 నుంచి బయట పడిన మిలియన్ల మంది రోగులకు రోగనిర్ధారణ చేసిన సమయంలో నాన్‌కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్న వారిని గుర్తించామని చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఏటా నాన్‌కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్న వారు ఆరు మిలియన్ల మంది మరణిస్తున్నట్లుగా గుర్తించామని ఆస్పత్రి పేర్కొంది. అందులో 23 శాతం మంది 30-70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అపోలో ఛైర్మన్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. హెల్త్ ఆఫ్ ది నేషన్ దాదాపుగా 35 వేల మంది కార్పోరేట్ ఉద్యోగుల ఆరోగ్య డేటాను పరిశీలించింది. అందులో 56 మంది ఏటా నాన్‌కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్న వారుగా గుర్తించారు. దీని కారణగా 48 శాతం ఉద్యోగుల్లో కొలెస్ట్రాల్.. 18 శాతం ఉద్యోగుల్లో ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో తేల్చారు.

English summary
Telangana is one of the states in India with a high prevalence of both hypertension and diabetes, found the Apollo Hospital's Health of the Nation report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X