నా సవాల్‌కు కట్టుబడ్డా, కోమటిరెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలని చూశారు: కెటిఆర్

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కెటిఆర్ మరోసారి తేల్చి చెప్పారు. నా సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించలేదని కెటిఆర్ చెప్పారు. కానీ, తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని కెటిఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిజెపి నేతలు తెలంగాణపై చూపిన ప్రేమకు ప్రతిఫలంగా తెలంగాణ ప్రజలు కూడ బిజెపిపై అదే ప్రేమను చూపుతారని కెటిఆర్ బిజెపిపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

బడ్జెట్ కేటాయింపుల విషయమై కేంద్రం నుండి సరైన నిధులు రాకపోవడంపై మంత్రి కెటిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి8వ, తేదిన ఢిల్లీకి వెళ్ళి తాము కేంద్ర మంత్రులను కలువనున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు.

బుదవారం నాడు తెలంగాణ మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు రాకపోవడం, బిజెపి నేతలు అనుసరిస్తున్న విధానాలపై కెటిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

2019లో మా సత్తాను చూపిస్తాం

2019లో మా సత్తాను చూపిస్తాం


2019 ఎన్నికల్లో తమ సత్తాను చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని కెటిఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని కెటిఆర్ స్పష్టం చేశారు. తన సవాల్‌కు కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్నారు. జిహెచ్‌ఎంసి, పాలేరు ఉప ఎన్నికల విషయంలో కూడ ఇదే రకంగా సవాల్‌ చేసి వెనుకకు వెళ్ళారని కాంగ్రెస్ నేతలపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి బలమైన లీడరైతే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

బిజెపికి తెలంగాణ ప్రజలు సమాధానం చెబుతారు

బిజెపికి తెలంగాణ ప్రజలు సమాధానం చెబుతారు


తెలంగాణ ప్రజలు బిజెపికి కూడ 2019 ఎన్నికల్లో ధీటుగానే సమాధానం చెబుతారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు.
బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం ఏ రకంగా నిధులు కేటాయించిందో ప్రజలు కూడ అదే రకంగా బిజెపికి సమాధానం బుద్ది చెబుతారని కెటిఆర్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్రానికి సుమారు 40వేల కోట్ల నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే కేంద్రం చిల్లిగవ్వ కూడ ఇవ్వలేదని కెటిఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బిజెపి ఎమ్మెల్యేలు లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలు తమ నియోజకవర్గాలు దాటి బయటకు రారని చెప్పారు.

రాహుల్‌గాంధీ సమర్ధత అందరికీ తెలుసు

రాహుల్‌గాంధీ సమర్ధత అందరికీ తెలుసు

రాహుల్‌గాంధీ సమర్ధత అందరికీ తెలుసునని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. తనను సూటూ, బూటూ మంత్రి అంటూ హేళనగా మాట్లాడేవారికి చెప్పేదొకటే..ఈ దేశంలో రాహుల్ కంటే పెద్ద పప్పు ఎవరూ లేరని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. గూగుల్‌లో టైప్ చేస్తే ఎవరు పప్పొ తెలుస్తుందన్నారు.

కోమటిరెడ్డి టిఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నించారు

కోమటిరెడ్డి టిఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నించారు


నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ పార్టీ తలుపు తట్టి వెళ్ళారని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. పదవుల కోసం నరహంతుకులుగా మారిన వాళ్లు కాంగ్రెస్ నాయకులని కెటిఆర్ ఆరోపించారు.. సీఎం పదవికోసం సొంత మనుషులను చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో 1991లో చేసిన నరమేధాన్ని మరిచిపోయి నల్గొండ హత్య గురించి మాట్లాడడాన్ని కెటిఆర్ తప్పుబట్టారు. కోమటిరెడ్డి తమ తలుపు తట్టి వెళ్లిపోయాడని కెటిఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+