కోదండరాం టీజేఎస్ పార్టీకి ఈసీ కేటాయించిన గుర్తు ఇదే
హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల వేళ కొత్త రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 15 రాజకీయ పార్టీలకు కొత్తగా ఎన్నికల గుర్తులు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.
ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి (టీజేఎస్)కు అగ్గిపెట్టె గుర్తును కేటాయించినట్టు ప్రకటించింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ టీజేఎస్.. మహాకూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.

టీజేఎస్ పార్టీ మొదట ఎన్నికల గుర్తు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనే పోటీచేయాలని ఇటీవల కాంగ్రెస్ నేతలు కొందరు ప్రతిపాదించగా.. తమకు ఈసీ ఎన్నికల గుర్తును కేటాయిస్తుందంటూ కోదండరాం వారి ప్రతిపాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా కోదండరాంకు ఈసీ అగ్గిపెట్టె గుర్తును కేటాయించడంతో తమ పార్టీ గుర్తుపైనే టీజేఎస్ పోటీ చేయనుంది.












Click it and Unblock the Notifications