కేంద్రమంత్రి స్థానంలో ఉండి అవాస్తవాలు చెబుతారా?: అమిత్ షాపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవాస్తవాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‍కు మనసు రావడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆక్షేపించారు.
వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రిస్థాయికి తగదని కేటీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందని అమిత్ షాకు గుర్తు చేయడంతోపాటు అందుకు సంబంధించిన పలు వార్తా కథనాలను ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.

సెప్టెంబర్ 17పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ.. భారతదేశంలో కలిసిపోయినప్పటి నుంచి సెప్టెంబర్ 17ను జాతీయ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
To those who ask why can’t we call it Liberation Day;
— KTR (@KTRBRS) March 27, 2023
Why do we celebrate 15th August as Independence Day and not as Liberation Day?
What should matter is respectful commemoration of the sacrifices & struggles against oppressors; be it the British or Nizam
“Stop being a…
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని అడుగుతున్నవారు.. ఆగస్టు 15ను దేశ స్వాతంత్ర్య దినోత్సవంగా ఎందుకు నిర్వహిస్తున్నామో ఆలోచించాలని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను, పోరాటాలను గౌరవ ప్రదంగా స్మరించుకోవడానికి బదులుగా.. గతించిన కాలానికి ఖైదీగా బంధీ కావడం మంచిది కాదన్నారు.
వివాదాలకు పక్కనపెట్టి, భవిష్యత్ నిర్మాణంపై దృష్టి సారించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం నుంచి విముక్తి పొందిన క్రమంలో విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. దేశంలో విలీనమైన నేపథ్యంలో సమైక్యతా దినోత్సవం జరుపుతున్నామని అధికార బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications