తెలంగాణ మరో కాశ్మీర్ అయ్యేది: బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోతే తెలంగాణ మరో కాశ్మీర్ అయ్యేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నిజాం పాలన నుండి విముక్తి చేసిన ఘనత పటేల్ దేనని ఆయన గుర్తు చేశారు.
సర్దార్ వల్లాబాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారంనాడు బిజెపి కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు.పటేల్ దేశానికి చేసిన సేవలను ఆయన ప్రస్తుతించారు. పటేల్ కారణంగానే ఆనాడు నిజాం నవాబు దేశంలో తన సంస్థానాన్ని విలీనం చేశాడని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిదిలో పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించనున్నట్టు చెప్పారు మంత్రి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు కేంద్రం నుండి నిధులు మంజూరైనా రాష్ట్రం నుండి స్పందన లేదన్నారు మంత్రి దత్తాత్రేయ.పటేల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోతే తెలంగాణ మరో కాశ్మీర్ అయ్యేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నిజాం పాలన నుండి విముక్తి చేసిన ఘనత పటేల్ దేనని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications