Telangana: తెలంగాణ వాసులకు అలర్ట్.. ఉన్నత విద్య సీట్లలో 95 శాతం స్థానికులకే..!
Telangana: రాబోయే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలలో ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కళాశాలలలో రాష్ట్రంలోని స్థానిక విద్యార్థులు మెజారిటీ సీట్లను పొందబోతున్నారు. స్థానిక, స్థానికేతర ప్రమాణాలను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ 95 శాతం సీట్లను తెలంగాణ స్థానికులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. మిగిలిన 5 శాతం స్థానికేతర విద్యార్థులకు, రాష్ట్రం వెలుపల నివసిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములకు రిజర్వ్ చేయబడుతాయి. అదనంగా ఆంధ్రపదేశ్ తో సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు జాతీయ సమైక్యత కోటా కింద మొత్తం సీట్లలో 10 శాతం సూపర్ న్యూమరీ ప్రాతిపదికన అవకాశం కల్పించబడుతుంది.
ఇప్పటి వరకు.. ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలలో 85 శాతం సీట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంతం(తెలంగాణ) స్థానికులకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే మిగిలిన 15 శాతం సీట్లు అందరు విద్యార్థఛులకు తెరిచి ఉన్నాయి. ఈ 15 శాతం సీట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ సాధారణ ప్రవేశ ప్రక్రియ నియమాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా అనుసరిస్తోంది.

ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. 2014 నుంచి 10 సంవత్సరాల పాటు ఈ ఉమ్మడి ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించింది. ఈ 10 సంవత్సరాల ఉమ్మడి ప్రక్రియ కాలం ఈ సంవత్సరంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కొత్త నిబంధనలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, సాంకేతిక, కళాశాల విద్యా కమిషన్ ఎ.శ్రీదేవసేన, పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉన్నత స్థాయి కమిటీ 95 శాతం సీట్లను తెలంగాణ స్థానికుల రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications