హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి: ముస్లిం సోదరులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముస్లీం సోదరలందరూ రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలోఆయన ఈ మేరకు సూచించారు.

అందరూ ఇంట్లోనే ఉండి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న క్రమంలో ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా శుక్రవారం రంజాన్ వేడుకలు జరగనున్నాయి.

ఈదుల్ ఫితర్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈద్గాలు, మక్కా మసీదు వద్ద, జామా మసీదు వద్ద భారీ ఎత్తులో ముస్లింలు చేరి ప్రార్థనలు చేసేవారు. అయితే, సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మే 12 నుంచి 10 రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Telangana lockdown: Offer Eid prayers at home, says Asaduddin Owaisi

ఈ క్రమంలో ముస్లిం సోదరులందరూ ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ముస్లిం సోదరులంతా తమ తమ ఇళ్లల్లోనే వేడుకలు జరుపుకోవాలని సూచించింది. మసీదుల్లో మతగురువుతోపాటు మరో ఇద్దరికి అనుమతిచ్చింది. ముస్లిం మతపెద్దలు, గురువురులు కూడా ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

తాను లాక్‌డౌన్‌కు వ్యతిరేకమని, ఎందుకంటే పేదల జీవితాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఎంపీ ఓవైసీ వ్యాఖ్యానించారు. అయితే, కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటించాల్సిందేనన్నారు. ప్రజలంతా కూడా లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం కావాలని, సురక్షితంగా ఉండాలని కోరారు. కరోనా మహమ్మారి ముగింపు కోసం ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులకు ఆయన పిలుపునిచ్చారు.

English summary
Hyderabad MP and All India Majlis-e-Ittehadul Muslimeen president Asaduddin Owaisi has appealed to the people to offer Eid-ul-Fir prayers at home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X